Aishwarya Rajesh: ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు

Aishwarya Rajesh: తమిళ సినిమా రంగంలో తన సహజ నటనతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్...

Sandeep Reddy
Updated on: 6 July 2021 3:00 PM IST
Actress Aishwarya Rajesh get Disappoints Being Cheated by her Own Assistant
X

ఐశ్వర్య రాజేష్ (ఫైల్ ఇమేజ్)

Aishwarya Rajesh: తమిళ సినిమా రంగంలో తన సహజ నటనతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "వరల్డ్ ఫేమస్ లవర్" చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి తన నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు కోలీవుడ్ సినిమా వర్గాల్లో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి తన అభిమానుల నుండి డబ్బులు తీసుకొని తన వ్యక్తిగత విషయాలను అటు అభిమానులతో పాటు ఇతరులకు లీక్ చేసాడని ఆ వ్యక్తి వాళ్ళ తాను ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఐశ్వర్య తెలిపింది. ఈ సంఘటనతో తాను ఎవరినో నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదని ఐశ్వర్య రాజేష్ తన బాధని పంచుకుంది.

అయితే ఆ వ్యక్తి తన వ్యక్తిగత సహాయకుడా లేక తన మిత్రులలో ఒకరా అని సినిమా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే తన శ్రేయోభిలాషులు ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సూచించిన ఈ విషయాన్నీ ఇంకా పెద్దది చేయదలచుకోక వదిలేసినట్టు ఐశ్వర్య తెలిపింది. అప్పట్లో తమిళ సినిమా పరిశ్రమలో దాదాపుగా 150 చిత్రాలలో కీలకపాత్రల్లో నటించిన నటుడు రాజేష్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ఐశ్వర్య రాజేష్ నటిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి అతి తక్కువ కాలంలోనే సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఐశ్వర్య భారతీయుడు-2, రిపబ్లిక్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించనుంది. విజ్ఞేశ్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం "తిట్టం ఇరందు"లో ఐశ్వర్య ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story