Maha Samudram: 'మహాసముద్రం' నుంచి 'మహా' లుక్ రివీల్

Maha Samudram: శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మహాసముద్రం'.

Samba Siva Rao
Published on: 12 April 2021 1:52 PM IST
Mahasamudram Movie New Poster
X

మహాసముద్రం 

Maha Samudram: శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మహాసముద్రం'. ఇప్పటికే విడుదలైన 'మహాసముద్రం' పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అదితిరావు హైదరి, ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న అదితిరావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'మహా' అనే పాత్రలో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'లైట్ హౌస్ ఆఫ్ మహాసముద్రం' అంటూ మరో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ లుక్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Rx100 తోనే దర్శకత్వ ప్రతిభ చాటుకున్న అజయ్‌ భూపతి 'మహాసముద్రం' అనే మరో వైవిద్యభరితంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదితిరావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ చూస్తే.. మహా ఏదో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 'మహా' అనే అమ్మాయి చుట్టూ నడుస్తుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా 'మహాసముద్రం' రిలీజ్ కానుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story