Abhinaya: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నా.. త్వరలోనే పెళ్లి, అభినయ కీలక ప్రకటన!

Actress Abhinaya opens up About Her Love Life
x

Abhinaya: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నా.. త్వరలోనే పెళ్లి, అభినయ కీలక ప్రకటన!

Highlights

Abhinaya: సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం సర్వసాధారణం.

Abhinaya: సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా హీరోయిన్ల పర్సనల్ లైఫ్‌ గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారి వివాహం, ప్రేమ వ్యవహారాలకు సంబంధించి వార్తలు నిత్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా అందాల తార అభినయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేసింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో మహేష్‌, వెంకీలకు చెల్లిగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభినయ. 2009లో వచ్చిన నాదిగోల్‌ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. శంభో శివ శంభో, దమ్ము వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తనదైన అభినయం, అందంతో ప్రేక్షకులను మెప్పించిన అభినయకు చెవులు వినిపించవు, మాటలు రావనే విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.

ఇదిలా ఉంటే అభినయ విశాల్‌తో ప్రేమలో ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది. తనకు విశాల్‌ మంచి స్నేహితుడు మాత్రమేనని ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేసింది.

తాను 15 ఏళ్లుగా తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతున్నట్లు తేల్చి చెప్పింది. అయితే అతను ఎవరు? పేరేంటి.? అన్న వివరాలను మాత్రం అభినయ తెలపలేదు. ఇదిలా ఉంటే తాజాగా అభినయ నటించిన 'పని' అనే మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories