Vijayashanti: ఇక ఇప్పటికి సెలవు: విజయశాంతి

సరిగ్గా 13ఏళ్ల తరవాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది నటి విజయశాంతి.

Krishna
Updated on: 3 Feb 2020 3:46 PM IST
Vijayashanti: ఇక ఇప్పటికి సెలవు: విజయశాంతి
X

సరిగ్గా 13ఏళ్ల తరవాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది నటి విజయశాంతి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటించారు. ఇండియన్ ఆర్మీకి ఇద్దరు కొడుకులను పంపించి అక్కడ వాళ్ళు ప్రాణాలను కోల్పోయిన దేశంపై తనకున్నా ప్రేమను చాటుకున్నా భారతి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు. ఆ పాత్ర కూడా ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో విజయశాంతి కీలక ట్వీట్ చేశారు.

"సరిలేరు మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు మీ విజయశాంతి" అంటూ ట్వీట్ చేశారు.


Krishna

Krishna

Next Story