Vijay Sethupathi: 'కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమా పదేపదే చూశా'.. విజయ్‌ చూసిన ఆ సినిమా ఏంటంటే..?

తమిళ హీరో విజయ్‌ సేతుపతి. కేవలం హీరోగానే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా సైడ్‌ క్యారెక్టర్‌లో కూడా కనిపించి మెప్పించాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Aug 2024 11:27 AM IST
Actor Vijay Sethupathi Says he Watched Mahesh Babu Athadu Movie in Repeat Mode When he was in Worry
X

Vijay Sethupathi: 'కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమా పదేపదే చూశా'.. విజయ్‌ చూసిన ఆ సినిమా ఏంటంటే..?

Vijay Sethupathi: సినిమా.. సాధారణంగా చూస్తే ఇదొక వినోదాత్మక మీడియా మాత్రమే. కానీ చాలా మంది సినిమా ఒక రిలీఫ్‌, సినిమా ఒక భావోద్వేగం. జీవితంలో సినిమా ఒక భాగమని ఫీలయ్యే వారు మనలో చాలా మందే ఉంటారు. సంతోషం వచ్చినా, బాధవచ్చినా ఒక సినిమా చూడాలని ఆశపడుతుంటారు. అయితే కేవలం సాధారణ ప్రేక్షకులకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే.. సెలబ్రిటీలు సైతం సినిమాను ఒక భావోద్వేగంగా ఫీలవుతుంటారు అనడానికి తాజా ఉదాహరణే నిదర్శనం. స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ఇటీవల ఇచ్చి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తమిళ హీరో విజయ్‌ సేతుపతి. కేవలం హీరోగానే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా సైడ్‌ క్యారెక్టర్‌లో కూడా కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్‌ బాబు నటించిన ‘అతడు’ సినిమాను పదే పదే చూశానని చెప్పుకొచ్చారు.

తాను కష్టాల్లో ఉండే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మహేశ్‌ బాబు నటించిన అతడు చిత్రాన్ని చాలాసార్లు చూశానని తెలిపారు. ఆ సినిమాలో మహేష్‌ ఎంట్రీ నుంచి క్లైమాక్స్‌ వరకూ ప్రతి సన్నివేశం తనకు గుర్తుందని అన్నారు. ఇక అతడులో అన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయని, ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారాని చెప్పుకొచ్చారు. మహేశ్‌ - త్రిషల మధ్య రొమాన్స్‌ కూడా నాకు నచ్చిందని, బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు, పాటలు అన్నీ నాకు ఇష్టం అని చెప్పుకొచ్చారు. దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

నిజానికి అతడు మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2005లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ టీవీలో అతడు సినిమా టెలికాస్ట్ అవుతుంటే అత్యధిక రేటింగ్స్‌ వస్తుంటాయి. ఇక విజయ్‌ సేతుపతి కెరీర్ విషయానికొస్తే.. మహారాజాతో సూపర్‌ హిట్ అందుకున్న విజయ్‌ సేతుపతి ప్రస్తుతం ‘విడుదల: పార్ట్‌2’తో పాటు మరో తమిళ సినిమాలో నటిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story