Tollywood Drugs Case: ఇవాళ ఈడీ ముందుకు హీరో తనీష్...

Tollywood Drugs Case: 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ...

Shireesha
Updated on: 17 Sept 2021 7:32 PM IST
Actor Tanish Attending Enforcement Directorate Investigation Today in Tollywood Drugs Case | Telugu Cinema News
X

ఇవాళ ఈడీ ముందుకు హీరో తనీష్...

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్ కేసులో ఈడీ దుకూడు పెంచింది. ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. 2017లో జరిగిన డ్రగ్ డీలింగ్, ఆర్ధిక లావాదేవీల గురించి ఆరా తీస్తు్న్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఇవాళ ఈడీ ముందుకు హీరో తనీష్ రానున్నారు. ఉదయం 10గంటలకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంక్ స్టేట్‌మెంట్, డ్యాక్యుమెంట్లతో రావాలని తనీష్‌కు నోటీసులు ఇచ్చారు.. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన డ్రగ్ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది.

మొదట పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, ముమైత్ ఖాన్, నవదీప్‌లను విచారించిన ఈడీ. వారి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇవాళ హీరో తనీష్ ఈడీ ముందు హాజరు కానున్నారు. డ్రగ్ డీలర్ కెల్విన్, తనీష్‌ల మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై విచారించనున్నారు. టాలీవుడ్ సెలబ్రేటీలకు డ్రగ్ హబ్‌గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. డ్రగ్స్ కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వివరాలను ఈడీ తెలుసుకోనుంది.

నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరుకానున్న నటుడు తనీష్. 10గంటలకు బ్యాంక్ స్టేట్మెంట్స్, డాక్యుమెంట్లతో రావాలని ఈడీ ఆదేశం. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేయనున్న ఈడీ. కెల్విన్ తనీష్ కి మధ్య జరిగిన ఆర్థికలావదేవిలపై స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న అధికారులు. డ్రగ్స్ హబ్ గా మరీనా ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా అన్న కోణంలో తనీష్ ని విచారించనున్న ఈడీ.


Shireesha

Shireesha

Next Story