Tanikella Bharani Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తనికెళ్ళ భరణి!

Tanikella Bharani Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Krishna
Published on: 27 Aug 2020 1:02 PM IST
Tanikella Bharani Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తనికెళ్ళ భరణి!
X

Tanikella Bharani Accept Green India Challenge

Tanikella Bharani Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి తన నివాసంలో మొక్కలు నాటారు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ విసిరిన ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన నివాసంలో మొక్కలు నాటారు.. అనంతరం అయన దర్శకుడు సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్, ప్రకాష్ రాజ్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసురుతున్నట్లుగా వెల్లడించారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సంతోష్ కుమార్ గారు చాలా బాగా ముందుకు తీసుకువెళ్తున్నారని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాని అయన వెల్లడించారు.

ఇక నటుడుగా రచయితగా తనికెళ్ళ భరణి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి ఇలా దాదాపు 320 సినిమాలలో నటించారు తనికెళ్ళ భరణి.. కామెడీ, విలన్, ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

Krishna

Krishna

Next Story