Son of India: సూర్య చేతుల మీదగా 'సన్నాఫ్ ఇండియా' టీజర్.!

Actor Surya To Launch Son Of India Teaser on Tomorrow
x

Son of India (The hans india)

Highlights

Son of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం "సన్నాఫ్ ఇండియా".

Son of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం "సన్నాఫ్ ఇండియా". డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు చిత్రీక‌ర‌ణ కంప్లీట్ చేసుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ద‌మైంది. కాగా..త‌మిళ స్టార్ హీరో సూర్య ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా మంచు విష్ణు నిర్మాణం వహిస్తున్నాడు. అయితే ఇది వరకే సూర్య, మోహన్ బాబులు "ఆకాశం నీ హద్దురా"లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఇప్ప‌టికే విడుదల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మూవీపై ఆస‌క్తిని పెంచింది. మోహ‌న్ బాబు చాలాకాలం త‌ర్వాత ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. శ్రీకాంత్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, అలీ, వెన్నెల కిషోర్, పృద్వీ రాజ్, రాఘుబాబు, రాజారవీంద్ర‌, ర‌విప్ర‌కాశ్ ముఖ్య పాత్ర‌ల్లో కనిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories