రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్‌.. వైరల్‌గా మారిన పెళ్లి కార్డు

Sumanth: టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

Arun Chilukuri
Published on: 28 July 2021 5:08 PM IST
Actor Sumanth Second Marriage with Pavithra
X

రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్‌.. వైరల్‌గా మారిన పెళ్లి కార్డు

Sumanth: టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్‌ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ మేరకు సుమంత్‌‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు సుమంత్‌కు హీరోయిన్‌ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరివురూ విడాకులు తీసుకుని తమ బంధానికి స్వస్తి పలికారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story