Srikanth: పునీత్ మరణానికి కారణం అది కాదు అంటున్న శ్రీకాంత్

Srikanth: పునీత్ రాజ్ కుమార్ మరణం వెనుక రహస్యాలు చెప్పిన శ్రీకాంత్

admin1
Updated on: 3 Nov 2021 6:00 PM IST
Actor Srikanth Reacted on Puneeth Rajkumars Death
X

పునీత్ రాజ్ కుమార్ మరణంపై స్పందించిన శ్రీకంత్ (ఫైల్ ఇమేజ్)

Srikanth: కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణంపై పలు వాదనలు మనం వింటూనే ఉన్నాం. అతిగా జిమ్ చేయడం వల్లే పునీత్ కు గుండెపోటు వచ్చిందని కొందరు చెబుతున్నారు. పునీత్ తన తదుపరి సినిమా "జేమ్స్" లోని పాత్ర కోసం కండలు పెంచేందుకు జిమ్ చేశారని వారి అభిప్రాయం. తాజాగా నటుడు శ్రీకాంత్ ఈ పుకార్లపై స్పందించారు. పునీత్ మరణానికి కారణం జిమ్ చేయడం కాదని అన్నారు. పునీత్ మరణించిన రోజు ఆయన వ్యాయామం చేయనేలేదు అని వాదించారు. పునీత్ చనిపోయే ముందు రోజు రాత్రి నుండే ఒంట్లో నలతగా ఉందని చెబుతున్నారని, ఫ్యామిలీ డాక్టర్ ని కూడా సంప్రదించారని, పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అంతా బాగానే ఉందని అన్నారని చెప్పుకొచ్చారు.

కానీ ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం పునీత్ కి విపరీతంగా చెమటలు పట్టి అపస్మారక స్థితికి వెళ్లారని, అప్పుడే ఆయనకి సడన్ స్ట్రోక్ వచ్చిందని, కేవలం నిమిషాల వ్యవవధిలో ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అని అన్నారు. అందువల్లే ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని బాధపడ్డారు. "జేమ్స్" సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ పునీత్ మరణం పై రియాక్ట్ అయ్యారు. పునీత్ పార్దీవ దేహాన్ని కూడా శ్రీకాంత్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలయ్య, అలీ, వెంకటేష్ తదితరులు సందర్శించి నివాళులు సమర్పించారు.

admin1

admin1

Next Story