బోయపాటి రిక్వెస్ట్ .. సోనూసూద్ భారీ డిమాండ్?

బోయపాటి రిక్వెస్ట్ .. సోనూసూద్ భారీ డిమాండ్?
x
Highlights

సోనూసూద్ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకి బిగ్ షాక్ ఇస్తున్నాడు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సోనూసూద్ ని తీసుకోవాలని అనుకున్నాడట బోయపాటి..

లాక్ డౌన్ టైంలో కష్టాలను ఎదుర్కున్న వలసకూలీలను ఆదుకొని, వారి కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశాడు సోనూసూద్. అలా వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. అంతటితో తన సేవలను ఆపకుండా కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్ లు అంటూ ఎదో ఒక విధంగా సహాయం చేస్తూనే వస్తున్నాడు సోనూసూద్. ఇలా సమస్య కనిపిస్తే చాలు.. సొల్యూషన్ లాగా మారిపోతున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసినా సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకు గాను ఇటివల ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన సంగతి కూడా తెలిసిందే.

అయితే అలాంటి సోనూసూద్ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకి బిగ్ షాక్ ఇస్తున్నాడు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సోనూసూద్ ని తీసుకోవాలని అనుకున్నాడట బోయపాటి. దీనికి ముందు సంజయ్ దత్ ని విలన్ గా అనుకున్నప్పటికీ సంజయ్ దత్ ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడుతుండడంతో అయన ప్లేస్ లో సోనూసూద్ ని అనుకున్నాడట బోయపాటి. అయితే ఆ పాత్రను చేయడానికి సోనూసూద్ ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేశాడట. షాకింగ్ రెమ్యునరేషన్ ని సోనూసూద్ డిమాండ్ చేయడంతో బోయపాటి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సినీ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.

ఇక ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం కావడం విశేషం. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ బ్యూటి ప్రయాగ మార్టిన్‌ హీరోయిన్ గా నటిస్తోంది.. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా తాజాగా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories