Maa Elections: కచ్చితంగా ఎన్నికల్లో ఓటేస్తాను అంటున్న సిద్ధార్థ్

Maa Elections: డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కి ఎంత దగ్గర అయినప్పటికీ సిద్ధార్థ్ కి తెలుగులో కంటే తమిళంలోనే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది.

admin1
Updated on: 9 Oct 2021 8:15 PM IST
Actor Siddharth Said That he will Cast his Vote in MAA Elections
X

Maa Elections: కచ్చితంగా ఎన్నికల్లో ఓటేస్తాను అంటున్న సిద్ధార్థ్

Maa Elections: డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కి ఎంత దగ్గర అయినప్పటికీ సిద్ధార్థ్ కి తెలుగులో కంటే తమిళంలోనే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. బొమ్మరిల్లు, ఓయ్, 180, ఓ మై ఫ్రెండ్, వంటి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్ధార్థ్ గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గృహం సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ ఈమధ్యనే ఒక వెబ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇక మరోవైపు సిద్ధార్థ్ మరియు శర్వానంద్ కలిసి "మహా సముద్రం" అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తాజాగా సిద్ధార్థ్ మా అసోసియేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు. "నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో లైఫ్ టైం మెంబర్ని. ఈసారి మా ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తాను. ప్రస్తుతం మా లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ నేను గమనిస్తూనే ఉన్నాను. నేను రాజకీయాల్లో గానీ సినిమాల పరంగా గానీ ఎవరిని వదలను. అందరిని తిడతాను. ఎందుకంటే ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుంది. నేను కచ్చితంగా అందరి మాటలు విని ఎవరు మాటలు నచ్చితే వారికే నా ఓటు వేస్తాను" అని క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్.

admin1

admin1

Next Story