Sai Dharam-Swathi: ముద్దులు, హగ్‌లతో జనాలకు షాక్.. సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జోడీ బాండింగ్ వెనుక సీక్రెట్ ఏంటంటే?

Sai Dharam-Swathi: 'కలర్స్'‌ తాజాగా స్వాతి నటించిన ‘మంత్ ఆఫ్‌ మధు’ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఈ‌ ఈవెంట్‌కు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్‌గా వచ్చాడు.

Shekhar G
Published on: 27 Sept 2023 3:29 PM IST
Actor Sai Dharam Tej And Colours Swathi Friendship Bonding Surprised
X

Sai Dharam-Swathi: ముద్దులు, హగ్‌లతో జనాలకు షాక్.. సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జోడీ బాండింగ్ వెనుక సీక్రెట్ ఏంటంటే? 

Sai Dharam-Swathi: 'కలర్స్'‌ తాజాగా స్వాతి నటించిన ‘మంత్ ఆఫ్‌ మధు’ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఈ‌ ఈవెంట్‌కు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్‌గా వచ్చాడు. అయితే, తేజ్, స్వాతి బాండింగ్ చూసి ప్రతీ ఒక్కరు షాకయ్యారు. ఏకంగా అంతా షాక్ అయ్యేలా తేజును రేయ్‌, వాడు అంటూ కలర్స్ స్వాతి పిలిచింది. ఇది చూసిన ఆడియెన్స్ షాక్ అయ్యారు. వీరిద్దరు గతంలో సత్య అంటూ ఓ షార్ట్ ఫిలింలో సందడి చేశారు. అయితే, ఈ ఒక్క షార్ట్‌ ఫిలింకే మరీ ఇంత క్లోజ్‌ అయ్యారా ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఆరా తీస్తే బ్యాక్ గ్రౌండ్‌లో చాలా విషయాలే బయటపడ్డాయి. అవేంటో చూద్దాం..

కాగా, కలర్స్‌ స్వాతి, సాయి ధరమ్ తేజ్ డిగ్రీ క్లాస్‌మేట్స్. స్వాతినే ఈ విషయం చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. అంతా తేజ్ కంటే నేనే పెద్ద అనుకుంటారు. తాను ఇండస్ట్రీకి తొందరగా వచ్చాను. అందువల్లే ఇలా అనుకుంటుంటారు. తేజ్ నా పేపర్లో చూసి కాపీ కొడతాడని, అలానే పాసయ్యాడు. మా ఇరువురి పేర్లు ఎస్ లెటర్‌తో మొదలవుతాయి. అందువల్లే ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌లో పక్క పక్కనే ఉండేవాళ్లం. తేజ్ నాకు జీవితంలో ఎంతో మంచి, ముఖ్యమైన స్నేహితుడు, నాకెంతో స‌పోర్ట్‌గా నిలిచాడు' అని స్వాతి చెప్పుకొచ్చింది.

అనంతరం తేజ్ మాట్లాడుతూ.. కలర్స్ స్వాతి నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్. అయితే, అన్ని పరీక్షల్లో చూపించదని, ల్యాబ్ టెస్ట్‌లో మాత్రం ఫలితం అస్సలు చూపించేది కాదంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆడియెన్స్‌కు వరుసగా షాక్‌లు ఇచ్చారు. కాగా, ఇంత క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయినా.. ఇప్పటివరకు బయట పడక పోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు జనాలు.

Shekhar G

Shekhar G

Next Story