స్టార్ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్.. కారణమేమింటే..?

స్టార్ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్.. కారణమేమింటే..?
Ram Pothineni Sorry To Lingusamy : "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో తన కెరీర్లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు యువ హీరో రామ్.
Ram Pothineni Sorry To Lingusamy : "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో తన కెరీర్లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు యువ హీరో రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే రామ్ కి ఉస్తాద్ అనే టైటిల్ కూడా లభించింది. తాజాగా రామ్ ఇప్పుడు "ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పాటలు విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సినిమా నుంచి మరొక పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ఈవెంట్ ఏ ఎం బి సినిమాస్ లో జరిగింది. పాట గురించి, హీరోయిన్ మరియు అభిమానుల గురించి కూడా మాట్లాడిన రామ్ దర్శకుడు లింగుస్వామి గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఈ విషయాన్ని తర్వాత గ్రహించిన రామ్ సోషల్ మీడియా ద్వారా దర్శకుడు లింగుస్వామి కి క్షమాపణలు చెప్పారు. "ఈ సినిమా తెరకెక్కడం లో ముఖ్య పాత్ర పోషించి మొత్తం తన భుజాల పైన వేసుకున్న వ్యక్తి గురించి చెప్పటం నేను మర్చిపోయాను. అతనే నా వారియర్ డైరెక్టర్ లింగుస్వామి. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని మీరు మీ భుజాల పైన వేసుకున్నారు. ఇప్పటివరకు నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరు కూడా ఒకరు. సారీ అండ్ లవ్ యు" అని చెప్పుకొచ్చాడు రామ్.
Totally missed mentioning the MAIN MAN at the end amidst all the madness!!
— RAm POthineni (@ramsayz) June 22, 2022
My Warriorrrr! My Director @dirlingusamy sir! Sir you have carried every single frame of this film on your shoulders!Thank you for being one of the best directors I've worked so far!!Sorry & Love you!!♥️
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT