Bigg Boss OTT: బిగ్‌బాస్‌ లోకి తీసుకోలేదని నడి రోడ్డుపై నటి హల్‌చల్‌

Bigg Boss OTT: రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు.

Arun Chilukuri
Updated on: 18 Aug 2021 4:34 PM IST
Actor Rakhi Sawant Protest Near Bigg Boss OTT House
X

Bigg Boss: బిగ్‌బాస్‌ లోకి తీసుకోలేదని నడి రోడ్డుపై నటి హల్‌చల్‌

Rakhi Sawant - Bigg Boss OTT: రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు. భాష ఏదైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు టీఆర్పీ రేటింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతాయి. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుంది. అందుకే ఈ బిగ్‌ రియాల్టీ షోకి భారత్‌లో ఎనలేని క్రేజ్‌ఉంది. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా ఈ షోలో పాల్గొన‌డానికి సినీ సెల‌బ్రిటీలు వెనుకాడ‌రు. తాజాగా వివాదాస్పద నటి రాఖీ సావంత్‌ తనను హిందీ బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

రాఖీ మంగళవారం స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ముంబై వీధుల్లో తిరుగుతూ హల్చల్ సృష్టించింది. డ్యాన్స్‌లు చేస్తూ, సూట్ కేసులు, స్పీక‌ర్స్ ప‌ట్టుకొని తెగ సంద‌డి చేసింది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ 14 లో తాను రూ. 14ల‌క్ష‌లు తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story