Rajinikanth News: కూతురి దర్శకత్వంలో రజినీకాంత్ చివరి సినిమా..!?

Rajinikanth News: కండక్టర్ స్థాయి నుండి ఇండియన్ సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన రజినీకాంత్ భారత చలన చిత్ర రంగంలో ఎంతోమంది

Sandeep Reddy
Published on: 8 July 2021 6:29 PM IST
Actor Rajinikanth Last Movie in His Daughter Soundarya Direction | Rajinikanth News Update
X

రజినీకాంత్ (ఫైల్ ఫోటో)

Rajinikanth News: కండక్టర్ స్థాయి నుండి ఇండియన్ సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన రజినీకాంత్ భారత చలన చిత్ర రంగంలో ఎంతోమంది నటి నటులకు గాడ్ ఫాదర్. తన స్టైలిష్ నటనతో డైలాగ్ డెలివరితో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్ త్వరలో సినిమా రంగం నుండి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోబోతున్నడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి పై పలు రకాల వార్తలు బయటికి వస్తున్న సమయాన ఇటీవలే తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్ళిన రజిని గురువారం తిరిగి చెన్నై బయలుదేరి రానున్నాడు. 2016లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న తర్వాత కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు రజినీకాంత్. ఇక తాజాగా వయసు పెరగడంతో ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి విశ్రాంతి తీసుకోబోతున్నాడని చెన్నై సినిమా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఇటీవల కొంత మంది సిని దర్శకులు కథ చెప్పడానికి వచ్చిన ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.

ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న "అన్నత్తే" చిత్రంలో నటిస్తున్న రజినీ ఈ చిత్రం తర్వాత తన చివరి చిత్రాన్ని తన కూతురు సౌందర్య రజినీ దర్శకత్వంలో నటించబోతున్నాడని, ఆ చివరి సినిమాకి సంబందించిన కథని కూడా సౌందర్య రెడీ చేసి తన తండ్రికి వినిపించిందని టాక్. ఇప్పటికే రజినీకాంత్ హీరోగా నటించిన 3డి చిత్రం "కొచ్చాడియాన్" సినిమాకి దర్శకత్వం వహించిన సౌందర్య, ధనుష్ హీరోగా "రాఘవన్-2" చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసింది. మొన్నటి తమిళనాడు ఎన్నికల ముందు కూడా పార్టీ స్థాపించి ఆ తర్వాత తన ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకియంలోకి రాలేనని రజినీకాంత్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న వార్తల ప్రకారం రజినీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో చివరి సినిమా నటించి తన 38 ఏళ్ళ సినీ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నడనే వార్త రజినీ అభిమానులను కలవర పెడుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story