Raj Tharun: నటుడు రాజ్ తరుణ్‌కు హైకోర్టులో ఊరట

Raj Tharun: ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2024 5:21 PM IST
Actor Raj Tarun got relief in the High Court
X

Raj Tharun: నటుడు రాజ్ తరుణ్‌కు హైకోర్టులో ఊరట

Raj Tharun: నటుడు రాజ్ తరుణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసులో..అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక..లావణ్యతో రాజ్‌తరుణ్‌కు పెళ్లైనట్లు ఆధారాలు లేవని హైకోర్ట్ స్పష్టం చేసింది. యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌కు (hero raj tarun) హైకోర్టులో ఊరట లభించింది. అతడికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నామని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు రాజ్‌ తరుణ్‌ ఇటీవల ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story