సినీ నటుడు బాలయ్య కన్నుమూత.. 300 సినిమాలకుపైగా నటించి...

Actor Producer Writer Mannava Balayya Passed Away | Tollywood News
x

సినీనటుడు బాలయ్య కన్నుమూత.. 300 సినిమాలకుపైగా నటించి...

Highlights

Mannava Balayya: మూడు తరాల హీరోలతో నటించిన బాలయ్య...

Mannava Balayya: ప్రముఖ సినీనటులు బాలయ్య హైదరాబాద్ యూసఫ్ గూడలో తనువుచాలించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. 300 సినిమాలకుపైగా నటించిన ఆయన మూడు తరాల హీరోల సరసన నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో సినీరంగంలోకి కాలుమోపిన బాలయ్య దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా ప్రతిభ చూపారు.

నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా శోభన్ బాబు నటించిన చెల్లెలికాపురం, హీరో కృష్ణతో కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన నేరము సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. దర్శకుడిగా పసుపుతాడు, నిజం చెబితే నేరమా? పోలీసు అల్లుడు సినిమాలను రూపొందించారు. ఉత్తమ కథారచయితగా ఊరికిచ్చిన మాట సినిమాతో నంది అవార్డును సొంతంచేసుకున్నారు.

చెల్లెలి కాపురం సినిమాకు ఉత్తమ నిర్మాతగా నంది అవార్డును అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా సినిమాల్లో నటించారు. బాలయ్య మరణంపట్ల సినీ దర‌్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ విచారం వ్యక్తంచేశారు. పుట్టిన రోజే... బాలయ్య తనువు చాలించడం అరుదైన విషయమైనప్పటికీ... సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. బాలయ్య అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో నిర్వహిస్తామని బాలయ్య కుమారుడు తులసీ ప్రసాద్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories