Prakash Raj: సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాష్ రాజ్.. ‘మరిచిపోలేని జ్ఞాపకం’ అంటూ నటుడి ఎమోషనల్ పోస్ట్!

Prakash Raj: సునీతా విలియమ్స్‌ను కలిసిన ప్రకాష్ రాజ్.. ‘మరిచిపోలేని జ్ఞాపకం’ అంటూ నటుడి ఎమోషనల్ పోస్ట్!
x
Highlights

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, దిగ్గజ అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిశారు.

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, దిగ్గజ అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కలిశారు. కేరళలోని కోజికోడ్ వేదికగా జరుగుతున్న 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్' (KLF) 2026కు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీతతో దిగిన ఫోటోలను ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

"ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం దక్కడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. ఆమె ఒక స్ఫూర్తిప్రదాత" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అంతరిక్ష అనుభవాలు.. కల్పనా చావ్లాతో అనుబంధం ఈ సాహిత్య సమ్మేళనంలో సునీతా విలియమ్స్ తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను మరియు భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో నేర్చుకోవడానికి ప్రతిరోజూ కొత్త విషయాలు ఉంటాయని తెలిపారు. అక్కడ గడిపిన ప్రతి క్షణం ఎంతో అద్భుతమని వివరించారు. తన సహోద్యోగి, దివంగత వ్యోమగామి కల్పనా చావ్లాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆమె తనకు గొప్ప ప్రేరణ అని సునీత పేర్కొన్నారు.

జనవరి 22న ప్రారంభమైన ఈ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మేధావులు, రచయితలు మరియు కళాకారులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories