పవన్ కల్యాణ్‌‌కు బాసటగా ప్రకాష్ రాజ్.. ఆధిపత్య ధోరణి ఏమిటి ?

Prakash Raj: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాపై ఏపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 27 Feb 2022 3:38 PM IST
Actor Prakash Raj Fires on AP Government About Pawan Kalyan Bheemla Nayak Issu
X

పవన్ కల్యాణ్‌‌కు బాసటగా ప్రకాష్ రాజ్.. ఆధిపత్య ధోరణి ఏమిటి ? 

Prakash Raj: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాపై ఏపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. సినీ వర్గాలు, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ బాసటగా నిలిచారు. భీమ్లా నాయక్ ఆంక్షలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్‌లో స్పందించారు. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటని ప్రశ్నించారు.

చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా అని అన్నారు. ఏదైన రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలని కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకని నిలదీశారు. ఎంతగా ఇబ్బందులు పెట్టినా ప్రేక్షకాభిమానులకు అడ్డకట్ట వేయలేరన్నారు ప్రకాష్ రాజ్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story