చిరంజీవి అన్నయ్యా మీ పేరులోనే ఆయ‌న‌ ఉన్నాడు- పొన్నాంబళం

Chiranjeevi: టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి సాటి న‌టుల‌కు త‌న వంతు ఆర్థిక సాయం చేస్తూ అండ‌గా నిలుస్తున్నారు

Samba Siva Rao
Updated on: 21 May 2021 5:23 PM IST
Actor Ponnambalam Says Special Thanks To Chiranjeevi
X

Actor Ponnambalam 

Chiranjeevi: టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి సాటి న‌టుల‌కు త‌న వంతు ఆర్థిక సాయం చేస్తూ అండ‌గా నిలుస్తున్నారు. క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూన్న సినీ కార్మికుల‌కు అండ‌గా నిలిచిన ఆయ‌న‌..ఇటీవలే టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పావ‌ల శ్యామ‌ల‌కు అర్థిక సాయం చేశారు. ఇప్పుడు దక్షిణాది నటుడు పొన్నాంబళంకు చిరంజీవి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు.

ప్రముఖ దక్షిణాది నటుడు పొన్నాంబళం గ‌త కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా, ఆయన శస్త్రచికిత్స కోసం చిరంజీవి 2 లక్షల రూపాయ‌లు అంద‌జేశారు. కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు తెలపడంతో తన ఆర్థికస్థితి అందుకు సహకరించక పొన్నాంబళం తీవ్ర వేదనకు గురయ్యారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి రెండు లక్షల రూపాయలను ఆన్ లైన్ లో బదిలీ చేశారు.

ఈ నేపథ్యంలో, పొన్నాంబళం భావోద్వేగాలకు గురయ్యారు. "చిరంజీవి అన్నయ్యా" అంటూ సంతోషం వెలిబుచ్చారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. "మీ పేరులోనే ఆంజనేయస్వామి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటున్నా... మీరు పంపిన డబ్బు నాకు చాలా ఉపయోగపడింది... ధన్యవాదాలు అన్నయ్యా... జై శ్రీరామ్" అంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు. తమిళం, తెలుగు, తదితర భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా పొన్నాంబళం అందరికీ సుపరిచితుడే. చిరంజీవితోనూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. తమిళ బిగ్ బాస్ షోలోనూ నటించి అభిమానులకు మరింత దగ్గరయ్యారు పొన్నాంబళం.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story