Naveen Polishetty: 4 కోట్ల రెమ్యునరేషన్ ని వద్దనుకున్న నవీన్ పొలిశెట్టి

admin1
Updated on: 26 Aug 2021 12:45 PM IST
Actor Naveen Polishetty Rejected 4 Crores Remuneration of Sitara Entertainments
X

 Naveen Polishetty - (Photo: The Hans India)

Naveen Polishetty: మొదటి సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" తోనే మంచి హిట్ ను అందుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా విడుదలైన "జాతి రత్నాలు" సినిమా తో ఏకంగా బ్లాక్బస్టర్ ను అందుకున్నాడు. నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ నవీన్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా గురించి అధికారిక ప్రకటన ను విడుదల చేయాల్సి ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం నవీన్ పొలిశెట్టి ఈ మధ్యనే స్క్రిప్ట్ బాగా లేదు అని ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాకి నో చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నవీన్ పొలిశెట్టి కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఈ హీరో మాత్రం ఆ సినిమాకి నో చెప్పటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నవీన్ పొలిశెట్టి మరియు "రంగ్ దే" ఫేమ్ వెంకీ అట్లూరి కి మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ మీటింగ్ ను ఏర్పాటు చేశారట. అక్కడ వెంకీ అట్లూరి నవీన్ పోలిశెట్టి కి ఒక మంచి కథను నేరెట్ చేశారు కానీ ఆ కథకు తను సెట్ కాడు అనుకున్న నవీన్ పొలిశెట్టి సున్నితంగా వారిని తిరస్కరించారట. ఈ సినిమా కోసం మైత్రీ వారు నాలుగు కోట్ల దాకా రెమ్యునిరేషన్ ఇస్తామన్నప్పటికీ నవీన్ పొలిశెట్టి మాత్రం సినిమాకి ఓకే చెప్పలేదట.

admin1

admin1

Next Story