Naresh: తనకు ప్రాణహాని ఉంది అంటూ కోర్టులో కేసు పెట్టిన నరేష్

Naresh: మూడవ భార్యపై కోర్టులో కేసు వేసిన నటుడు

Jyothi
Published on: 29 Jan 2023 11:10 AM IST
Actor Naresh Files Petition in Court Claiming life Threat Due to His Wife
X

Naresh: తనకు ప్రాణహాని ఉంది అంటూ కోర్టులో కేసు పెట్టిన నరేష్ 

Naresh: ప్రముఖ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి మరియు నరేష్ ల మధ్య గొడవ రోజురోజుకీ పెరుగుతూనే వస్తోంది. తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరి వివాదంలో మరొక కొత్త మలుపు చోటుచేసుకుంది. రమ్య రఘుపతి వల్ల తనకు ప్రాణహాని ఉంది అంటూ నరేష్ కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రమ్య రెక్కీ చేయించింది అంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలా చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటక రౌడీ రాకేష్ శెట్టితో చేతులు కలిపి నరేష్ కి వ్యతిరేకంగా రమ్య రఘుపతి రెడ్డి చేయించిందని అంతేకాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో ఆమె తన ఫోన్ ని కూడా హ్యాక్ చేసింది అని నరేష్ ఆ పిటిషన్ లో ఆరోపించారు. మరోవైపు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్లి కూడా త్వరలోనే జరగనుంది. కానీ వీళ్ళిద్దరి పెళ్లి జరగనివ్వనని తనకు ఇంకా విడాకులు రాలేదని మరి అప్పుడే నరేష్ మరొక పెళ్లి ఎలా చేసుకుంటారు అని రమ్య కోర్టులో వాదిస్తున్నారు.

"ఎంత కష్టమైనా నేను పోరాటం చేసి తీరుతాను నరేష్ తో కలిసి ఉండటానికే ప్రయత్నిస్తాను నడుస్తుంది నేను మాత్రం విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను," అని రమ్య రఘుపతి ఇప్పటికే స్పష్టం చేశారు. మరి ఇప్పుడు నరేష్ తనకు ప్రాణహాని ఉంది అని చేస్తున్న కామెంట్లు ఆ విషయంలో రమ్య రఘుపతి ఎలా రియాక్ట్ అవుతారు అని ఇంకా తెలియాల్సి వుంది. మరోవైపు సినిమాలు కంటే నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఈ వివాదాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story