Saripodhaa Sanivaaram Glimpse: నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..

Actor Nanis Birthday Special Saripodhaa Sanivaaram Glimpse Released
x

Saripodhaa Sanivaaram Glimpse: నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..

Highlights

Saripodhaa Sanivaaram Glimpse: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు.

Saripodhaa Sanivaaram Glimpse: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నాని 31గా వ‌స్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తుండ‌గా.. ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించాడు.

”కోపాలు ర‌క‌ర‌కాలు. ఒక్కో మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూశారా.. నేను చూశా అంటూ గ్లింప్స్ వీడియోను ప్రారంభించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories