Jabardasth: అనసూయ స్థానంలో రాబోతున్న కొత్త యాంకర్..

Jabardasth: జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అనసూయ.

Arun Chilukuri
Updated on: 30 July 2022 7:00 PM IST
Actor Manjusha To Host Jabardasth Show
X

Jabardasth: అనసూయ స్థానంలో రాబోతున్న కొత్త యాంకర్..

Jabardasth: జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అనసూయ. గత పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈ షో వల్లనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ అయిన ఈ భామ జబర్దస్త్ కి వీడ్కోలు పలికింది. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ మరియు అనసూయ ఇద్దరు ఒకేసారి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడం ఈ షో పై చాలా నెగటివ్ ఎఫెక్ట్ చూపించనుందని, ఈ షో టిఆర్పి భారీగా తగ్గబోతోందని చెప్పుకోవచ్చు. మరోవైపు అనసూయ స్థానంలో నిర్మాతలు మరొక యాంకర్ ను రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ యాంకర్ మంజుష ఇప్పుడు అనసూయ స్థానంలో జబర్దస్త్ కి హోస్ట్ గా వ్యవహరించనుందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఆగస్టు 4 న ఎయిర్ కాబోతున్న ఎపిసోడ్ నుంచి కొత్త యాంకర్ అనసూయ స్థానంలోకి రాబోతోంది. మరోవైపు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ చెందుతున్నారు. మరి జబర్దస్త్ కి రెండు స్తంభాలైన అనసూయ మరియు సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయాక ఈ షో టిఆర్పి లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story