Mammootty: మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. ఆ బాధను మరవకముందే..

Mammootty: మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 12 Sept 2023 4:39 PM IST
Actor Mammootty’s Sister Ameena Passes Away
X

Mammootty: మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. ఆ బాధను మరవకముందే..

Mammootty: మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి అమీన కన్నుమూసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా కొన్నినెలల క్రితమే మమ్ముట్టి తల్లి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే సోదరి కన్నుమూయడంతో మమ్ముట్టి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story