Krishnam Raju: నేడు ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju: అధికారిక లాంఛనాలతో మధ్యాహ్నం అంత్యక్రియలు

Jyothi
Updated on: 12 Sept 2022 10:15 AM IST
Actor Krishnam Raju Passed Away
X

Krishnam Raju: నేడు ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju: సినీ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను ఇవాళ మొయినాబాద్ కనక మామిడి ఫామ్ హౌస్‌లో నిర్వహించనున్నారు. తొలుత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు భావించారు. అనంతరం మొయినాబాద్‌లోని తమ ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణంరాజు పార్దివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో సందర్శనార్ధం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఉంచారు. ఈ మేరకు కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story