సీఎం జగన్‌కు లేఖ రాసిన కైకాల సత్యనారాయణ

Kaikala Sathyanarayana: ఇటీవల తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ కోలుకున్నారు.

Arun Chilukuri
Published on: 20 Jan 2022 5:43 PM IST
Actor Kaikala Satyanarayana thanks YS Jagan
X

సీఎం జగన్‌కు లేఖ రాసిన కైకాల సత్యనారాయణ

Kaikala Sathyanarayana: ఇటీవల తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్న కైకాల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ‌ రాశారు. అనారోగ్య సమయంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ చూపిన శ్రద్ధ కళాకారుల పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసిందన్న కైకాల రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని లేఖలో పేర్కొన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story