బిగ్ బాస్ నుంచి దివి ఔట్?

బిగ్ బాస్ నుంచి దివి ఔట్?
x
Highlights

రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఏడో వారం చివరికి వచ్చింది. అంతేకాదు మరో ఎలిమినేషన్ కి కూడా రంగం సిద్దమైంది. అయితే ఈ వారం హౌస్ నుంచి దివిని పంపించనున్నట్టుగా తెలుస్తోంది.

రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఏడో వారం చివరికి వచ్చింది. అంతేకాదు మరో ఎలిమినేషన్ కి కూడా రంగం సిద్దమైంది. అయితే ఈ వారం హౌస్ నుంచి దివిని పంపించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ వారం హౌస్ మేట్స్ లో దివి, మోనాల్ డేంజర్ జోన్ లో ఉండగా అందరికంటే ఓట్లు తక్కువగా మోనాల్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ దివిని ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. మోనాల్ ని కాపాడేందుకే బిగ్ బాస్ నిర్వాహకులు దివిని ఎలిమినేట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లయిన యాంకర్ దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేషన్స్ లను కూడా బిగ్ బాస్ నిర్వహకులు ప్రేక్షకుల ఓటింగ్ సిస్టంను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఇక దివి ఎలిమినేట్ అయినట్టుగా రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోతో అర్ధం అయినట్టుగా కనిపిస్తుంది. గతంలో ఏమిలినేట్ అయిన కంటెస్టెంట్లతో ఇంటర్వ్యూలు చేసిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో ఫొటో పెడుతున్నారు. అందులో భాగంగానే రాహుల్ షేర్ చేసిన ఫొటో బ్యాగ్రౌండ్‌లో ఇప్పుడు దివి ఫోటో కూడా ఉంది. దీనితో ఈ వారం దివితో రాహుల్ ఇంటర్వ్యూ ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక అటు వైల్డ్ డాగ్ షూటింగ్ లో నాగార్జున బిజీగా ఉండడంతో ఈ వారం బిగ్ బాస్ 4 హోస్ట్ గా నాగార్జున కోడలు సమంత చేయనుంది..ఇప్పటికే ఆఫీషియల్ గా అనౌన్సు కూడా వచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories