జ‌స్టిస్ చౌద‌రి పాట‌కు బ్ర‌హ్మాజీ డ‌బ్ స్మాష్.. వీడియో వైరల్

జ‌స్టిస్ చౌద‌రి పాట‌కు బ్ర‌హ్మాజీ డ‌బ్ స్మాష్.. వీడియో వైరల్
x
Highlights

స‌త్య‌దేవ్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ కాంబోలో వ‌స్తున్న చిత్రం తిమ్మర‌సు.. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో జ‌స్టిస్ చౌద‌రి పాట‌ను ప్లే చేయగా దానికి బ్ర‌హ్మాజీ డ‌బ్ స్మాష్ చేశాడు.

ఎన్. టి. రామారావు, శ్రీదేవి, శారద ముఖ్యపాత్రల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన జ‌స్టిస్ చౌద‌రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్ గా కనిపించి మెస్మరైజ్ చేశారు.. ఇక ఈ సినిమాలో "చట్టానికి న్యాయానికి జరిగిని ఈ సమరంలో " అంటూ వచ్చే పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.. ఈ పాటలో ఎన్టీఆర్ అభినయానికి ప్రతి ఒక్క అభిమాని ఫిదా అయిపోయారు.

అయితే ఈ పాటకి సినీ నటుడు బ్ర‌హ్మాజీ బ్ర‌హ్మాజీ డ‌బ్ స్మాష్ చేశారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. స‌త్య‌దేవ్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ కాంబోలో వ‌స్తున్న చిత్రం తిమ్మర‌సు.. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో జ‌స్టిస్ చౌద‌రి పాట‌ను ప్లే చేయగా దానికి బ్ర‌హ్మాజీ డ‌బ్ స్మాష్ చేశాడు. అయితే బ్ర‌హ్మాజీ పక్కనే ఉన్న నటుడు రవిబాబు విచిత్రమైన ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ కడుపుబ్బా నవ్వించారు.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

అటు విభిన్నమైన కథతో తిమ్మరుసు సినిమా తెరకెక్కుతుంది.. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇందులో సత్యదేవ్ కూడా లాయర్ గానే కనిపిస్తున్నాడు.. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories