‌HBD Balakrishna: బాలయ్య బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ రిలీజ్!

Actor Balakrishna Birthday Special Akhanda Movie New Poster Released
x

నంద‌మూరి బాల‌కృష్ణ (ఫొటో ట్విట్టర్)

Highlights

Akhanda New Poster: రేపు (జూన్ 10) నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ అందింది.

Akhanda New Poster: రేపు (జూన్ 10) నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ అందింది. బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న 'అఖండ' సినిమా నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

సోషల్ మీడియాలో బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ట్విట్టర్లో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్‌ సంబరాలకు అంతే లేదు. #Akhanda, #NandamuriBalakrishna, #HBDBalakrishna #HappyBirthdayBalakrishna లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్‌ చేస్తున్నారు ఆయన అభిమానులు.

కాగా, ఈ పోస్టర్‌లో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని చిరునవ్వు చిందిస్తూ అదరగొట్టారు బాల‌య్య బాబు. ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోంది. శ్రీకాంత్, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో నటించనున్నారు. సంగీతం త‌మ‌న్ అందిస్తున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వీంద‌ర్ రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories