ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్‌ ఇంట్లో విషాదం

Arun Chilukuri
Published on: 15 Sept 2020 10:01 AM IST
ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్‌ ఇంట్లో విషాదం
X

Ashok Kumar: ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి కె.వసుంధరాదేవి (88) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో అశోక్ కుమార్‌ ను సినీ ప్రముఖులు పరామర్శించారు. ఇక అశోక్ కుమార్ విషయానికొస్తే.. ఈయన నిర్మాతగా 'రక్త తిలకం', 'ధృవ నక్షత్రం', 'చెవిలో పువ్వు', 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్' 'జయదేవ్' వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన నిర్మాతగానే కాకుండా నటుడిగా 'భారత్ బంధ్' సినిమాతో తెరంగేట్రం చేసాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ నటుడిగా పాపులర్ అయ్యాడు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story