కేరళ పోలీసుల ప్రవర్తన గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి

*కేరళ పోలీసుల ప్రవర్తన గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి

Rama Rao
Updated on: 26 May 2022 4:30 PM IST
Actor Archana Kavi’s Social Media Post Against Kerala Police
X

కేరళ పోలీసుల ప్రవర్తన గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి

Archana Kavi: ప్రముఖ మలయాళ నటి అర్చన కవి చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు అని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది ఈ భామ. నటిగా మరియు టీవీ హోస్ట్గా అర్చన కవి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీస్ అతను ఆటోని ఆపి వారితో చాలా పొగరుగా ప్రవర్తించారు అంటూ ఆమెను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ముఖానికి మాస్క్ వేసుకోవడం తో ఆ సదరు పోలీసు అతను ఈమెను గుర్తుపట్టలేదట.

"ఆ సమయంలో మేము ప్రయాణించటం అంత పెద్ద తప్పా? జేస్నా, నేను, మరియు ఆమె కుటుంబ సభ్యులు మిలానో నుండి తిరిగి వస్తున్నాము. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు కేరళ పోలీస్ ఆఫీసర్ లు మమ్మల్ని ఆపి ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆటోలో మేమంతా ఆడవాళ్ళమే ఉన్నాము. కానీ వారు మాత్రం మాతో చాలా రాష్ గా ప్రవర్తించారు. నాకు చాలా భయం వేసింది. మేము ఇంటికి వెళ్తున్నాం అని చెబుతుంటే వాళ్లు ఇంటికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు" అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అర్చన.

Rama Rao

Rama Rao

Next Story