Pratap Pothen: సినిమా పరిశ్రమలో విషాదం.. 'ఆకలి రాజ్యం' నటుడు ప్రతాప్‌ పోతెన్‌ మృతి..

Pratap Pothen: సినిమా పరిశ్రమలో విషాదం.. ఆకలి రాజ్యం' నటుడు ప్రతాప్‌ పోతెన్‌ మృతి..

Rama Rao
Updated on: 15 July 2022 11:54 AM IST
Actor and Director Pratap Pothen Passes Away
X

Pratap Pothen: సినిమా పరిశ్రమలో విషాదం.. ఆకలి రాజ్యం' నటుడు ప్రతాప్‌ పోతెన్‌ మృతి..  

Pratap Pothen: సీనియర్‌ నటుడు ప్రతాప్‌ పోతన్‌(70) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మరణవార్త తెలుసుకుని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వ్యాపార కుటుంబంలో పుట్టిన ప్రతాప్‌కు చిన్నతనం నుంచి సినీ పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. ఆరవం అనే మలయాళీ సినిమాతో ఆయన నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . తెలుగు, తమిళం, మలయాళంలో వందకుపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఆకలిరాజ్యం, కాంచన గంగ, జస్టిస్‌ చక్రవర్తి, చుక్కల్లో చంద్రుడు, మరో చరిత్ర, వీడెవడు చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా నటించి తెలుగువారికీ చేరువయ్యారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఆయన పలు సినిమాలు తెరకెక్కించారు. చైతన్య అనే తెలుగు చిత్రానికీ ఆయన దర్శకుడిగా పనిచేశారు. ఇక, వ్యక్తిగత విషయాలకు వస్తే 1985లో నటి రాధికను ప్రతాప్‌ వివాహమాడారు. వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లైన ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారు.

Rama Rao

Rama Rao

Next Story