Amala Paul: ఆ వీడియోలను విడుదల చేస్తా.. హీరోయిన్‌ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు..!

Amala Paul: తమిళంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

Arun Chilukuri
Updated on: 30 Aug 2022 9:00 PM IST
Actor Amala Paul Files Cheating Complaint Against Bhavninder Singh Dhatt
X

Amala Paul: ఆ వీడియోలను విడుదల చేస్తా.. హీరోయిన్‌ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు..!

Amala Paul: తమిళంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్ తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే గత కొంతకాలంగా సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈమె ఇప్పుడు లైంగిక వేధింపుల కంప్లైంట్ నమోదు చేసింది. భవ్నీందర్ సింగ్ దత్ తనను లైంగికంగా వేధించాడు అంటూ అమలాపాల్ విల్లుపురం పోలీసులను ఆశ్రయించింది. బిజినెస్ లో మోసం చేశాడని అంతేకాకుండా తనకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు అంటూ అమలాపాల్ అతనిపై కంప్లైంట్ నమోదు చేసింది.

పోలీసులు ఇప్పుడు అతనిపై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు విషయంలో మరో పదకొండు మందిని కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో భవ్నీందర్ సింగ్ దత్ అమలా పాల్ కలిసి ఓ ప్రొడక్షన్ కంపనీని మొదలు పెట్టారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ గత కొంతకాలంగా నిర్మాణ సంస్థ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, తనకు రావాల్సిన డబ్బులు అడగగా అతను తిరిగి ఈమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story