Bomb Threat: హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది

Kranthi
Published on: 1 Jun 2021 1:16 PM IST
Actor Ajith Gets Fake Bomb Call
X

నటుడు అజిత్ (ఫైల్ ఇమేజ్)

Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది. చెన్నై తిరువాన్మియూరులో ఉన్న ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు.

జాగిలాలతో పాటు అజిత్ ఇంటికి వెళ్లిన బాంబ్ స్వాడ్ ఇంటి మొత్తాన్ని తనిఖీ చేశారు. బాంబు కనిపించకపోవడంతో అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు.

Kranthi

Kranthi

Next Story