Actor Ajay: ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నా.. అజయ్ భార్య ఎవరంటే..

* "ఖుషి" సినిమాలో ఒక కాలేజీ స్టూడెంట్ గా వెండితెర కు పరిచయమయ్యాడు అజయ్.

admin1
Updated on: 9 Oct 2021 12:24 PM IST
Actor Ajay Shares Some Incidents About his College Days and his Wife Swetha
X

తన భార్య శ్వేతతో కలిసి అజయ్ (ట్విట్టర్ ఫోటో)

Actor Ajay: "ఖుషి" సినిమాలో ఒక కాలేజీ స్టూడెంట్ గా కనిపించి "ఒక్కడు"తో ప్రిన్స్ మహేష్ బాబు స్నేహితుడిగా చేరి "సై" అంటూ వెండితెర విలన్ గా మారి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రధాన పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్న నటుడు అజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తెలుగు సినిమా స్టార్ హీరోలతో నటించడటంతో పాటు తాను కూడా హీరోగా ఒకడి రెండు సినిమాలు నటించిన అజయ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలోకి రాకముందు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నాడు.

తను కాలేజీ చదువుకుంటున్న సమయంలో ఇంట్లో దొంగతనంగా డబ్బులు తీసుకొని స్నేహితుడితో కలిసి నేపాల్ వెళ్ళామని ఆ తర్వాత తిరిగి రావడానికి డబ్బులు లేకపోవడంతో కొన్నిరోజులు అక్కడే ఒక హోటల్ లో గిన్నెలు కూడా కడిగానని చెప్పుకొచ్చాడు. ఇక తన కాలేజీ స్నేహితురాలు శ్వేతని ప్రేమించి ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నానని తరువాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నామని తెలిపాడు.

2017లో జరిగిన మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలలో ఎంపికై చివరి రౌండ్ వరకు చేరిన అజయ్ సతీమణి శ్వేత 2018 లో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిస్టర్స్ సౌత్ ఇండియాగా ఎంపికైంది. ప్రస్తుతం "ఆచార్య" సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్న అజయ్ ఇటీవల విడుదలైన "తిమ్మరుసు" సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

admin1

admin1

Next Story