Adivi Sesh: రెండు హిందీ సినిమాలు సైన్ చేశాను అంటున్న అడివి శేష్

* "మేజర్" సినిమా తర్వాతే ఏదైనా అంటున్న అడవి శేష్

admin1
Updated on: 3 Dec 2021 3:05 PM IST
Actor Adivi Sesh says i have Signed for Two Hindi Movies
X

 అడివి శేష్ (ఫైల్ ఫోటో)

Adivi Sesh: ఎప్పుడో 2019 లో "ఎవరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో అడవి శేష్ ఇప్పటిదాకా తన తదుపరి సినిమా "మేజర్" షూటింగ్ తో బిజీగా నే ఉన్నారు. శశి కిరణ్ టిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేష్ బాబు స్వయంగా నిర్మించడం విశేషం. 2008 ముంబై ఆధారంగా అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే తాజాగా తన తదుపరి సినిమాల గురించి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అని అడగగా అడవి శేష్ మాత్రం "మేజర్" సినిమా తరువాత మాత్రమే అని చెప్పేసారు.

"నిజానికి నేను 2 హిందీ సినిమాలన్నీ సైన్ చేశాను. కానీ 'మేజర్' సినిమా తర్వాత మాత్రమే నేను వాటిని ఎనౌన్స్ చేస్తాను. త్వరలోనే మరికొన్ని విషయాలను ప్రకటించబోతున్నను కానీ అన్నిటికంటే ముందుగా మేము మేజర్ సందీప్ కథని వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాము" అని చెప్పారు అడివి శేష్. శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story