Seetha Payanam: వాలెంటైన్స్ డే కానుకగా 'సీతా పయనం'.. యాక్షన్ కింగ్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ గ్రాండ్ ఎంట్రీ!

Seetha Payanam: బహుముఖ ప్రజ్ఞాశాలి, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'సీతా పయనం'.

Arun Chilukuri
Published on: 6 Feb 2026 11:52 AM IST
Seetha Payanam: వాలెంటైన్స్ డే కానుకగా సీతా పయనం.. యాక్షన్ కింగ్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ గ్రాండ్ ఎంట్రీ!
X

Seetha Payanam: బహుముఖ ప్రజ్ఞాశాలి, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) విడుదల కానుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య అర్జున్ సరసన నిరంజన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా ఒక పవర్ ఫుల్ కామియో రోల్‌లో మెరవనున్నారు.

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ పాజిటివ్ బజ్‌తో విడుదలకు సిద్ధమైంది. చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించగా, జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. యాక్షన్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న మేకర్స్, త్వరలోనే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story