Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్.

Action Hero Arjun Playing Police Officer Role in Mahesh Babu Sarkaru Vaari Paata
x

Sarkaru Vaari Paata

Highlights

Sarkaru Vaari Paata: యాక్షన్ కింగ్ అర్జున్ సర్కారు వారి పాటకు స్పెషల్ లోఉండబోతున్నట్లు సమాచారం.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే పిచ్చ క్రేజ్ ఉంటుంది. సర్కారువారి పాట సినిమా న్యూస్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉందో చూస్తేనే అర్ధమవుతోంది. ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్టులో మరో క్రేజీ అట్రాక్షన్ ఉండబోతుందనే వార్త మహేష్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా వచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. స్టయిలిష్ గా ఉండబోతున్న మహేష్ బాబు పాత్రకు మరో స్టయిలిష్ ఆర్టిస్ట్ అర్జున్ తోడవడం.. నిజంగా ఈ సినిమాకు బోనస్ అనే చెప్పుకోవాలి.

అర్జున్ఈ విలన్ గా నటిస్తున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఆయన విలన్ కాదట .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. గతంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ సారి కూడా అర్జున్ తన నటనతో ఆకట్టుకుంటారని అంటున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories