మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇరగదీసిన చిరంజీవి, రామ్ చరణ్..

Bhale Bhale Banjara: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్య మూవీ నుంచి భలే భలే బంజారా అనే సాంగ్‌ను చిత్రయూనిట్‌ ఇవాళ విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 18 April 2022 6:30 PM IST
Acharyas Bhale Bhale Banjara Song Released
X

మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇరగదీసిన చిరంజీవి, రామ్ చరణ్..

Bhale Bhale Banjara: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్య మూవీ నుంచి భలే భలే బంజారా అనే సాంగ్‌ను చిత్రయూనిట్‌ ఇవాళ విడుదల చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల డ్యాన్స్‌ చూసి మెగా ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతుంటారు. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే అది అభిమానులకు పండుగే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి విజువల్‌ ట్రీట్‌నే ఇచ్చారు మేకర్స్‌. ఈ పాటలో ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లు పోటీ పడి డ్యాన్స్‌ చేయడం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో శేఖర్‌ మాస్టర్‌ తీర్చిదిద్దిన కూల్‌ స్టెప్పులు, కామ్రేడ్‌ లుక్కులు వావ్‌ అనిపించేలా ఉన్నాయి. మణిశర్మ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శంకర్‌ మహదేవన్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ గానం శ్రోతల్ని విశేషంగా అలరించేలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న ఆచార్య సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నెల 23న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది చిత్ర యూనిట్‌. ఏపీ సీఎం జగన్‌ ఈ ప్రీ రిలీజ్ వేడకకు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ చక్కర్లు కొడుతోంది. అయితే ముందుగా ఈ వేడుకను విజయవాడలో పెట్టాలని భావించారు. కొన్ని అనివార్య కారణాలతో ఈవెంట్‌ను హైదరాబాద్‌కు షిప్ట్‌ చేసినట్టు సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story