Tollywood: మోగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్ రెడీ చేసిన కొరటాల

Tollywood: ఇప్పటిదాకా లాహే లాహే అంటూ ఊగుతున్న మెగా ఫ్యాన్స్ కి తర్వలో మరో సాంగ్ రాబోతుంది.

Kranthi
Published on: 24 May 2021 11:06 AM IST
Acharya Romantic Update Ready From Koratala Shiva
X

కొరటాల శివ & మెగాస్టార్ చిరంజీవి

Tollywood: అదుగో ఇదుగో ఆచార్య వచ్చేస్తున్నాడని సంబరాలు చేసుకున్నారు మెగా ఫ్యాన్స్. కాని అది అలా అలా వాయిదా పడి చివరకు అనుకున్న తేదీకే రిలీజ్ అని ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తే.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఆ ఉత్కంఠను ఎగరేసుకుపోయింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయి.. కేవలం మరో 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. కరోనా ఆటంకం వచ్చి పడింది. దీంతో రిలీజ్ వాయిదా పడింది. నిరాశ చెందిన మెగాస్టార్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఓ సర్ ప్రైజ్ రెడీ చేశారంట. అదే ఆచార్య సెకండ్ సాంగ్.

ఇప్పటిదాకా లాహే లాహే అంటూ ఊగుతున్న మెగా ఫ్యాన్స్ కి తర్వలో మరో సాంగ్ రాబోతుంది. అది కూడా రొమాంటిక్ సాంగ్. ఆచార్య నుంచి సెకండ్ సాంగ్ గా రిలీజవుతున్న ఈ పాట దుమ్ము రేపుతుందని ఆ చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ రొమాంటిక్‌ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ చిరంజీవిపై చిత్రీకరించిందా? లేక రామ్ చరణ్‌తో షూట్ చేసిందా అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం.

ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. సిద్ద పాత్రలో ఆయన నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో 15 రోజుల పాటు షూటింగ్ చేస్తే మూవీ షూటింగ్ అంతా ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story