హిందీలో కూడా విడుదల కాబోతున్న ఆచార్య సినిమా

Acharya Movie: హిందీలో కూడా విడుదల కాబోతున్న ఆచార్య సినిమా

admin1
Updated on: 8 April 2022 1:00 PM IST
Acharya Movie to Be Released in Bollywood | Telugu Movie News
X

బాలీవుడ్ లో విడుదల కాబోతున్న మెగాస్టార్ సినిమా

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అతి త్వరలోనే "ఆచార్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే కాక హిందీ లో కూడా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. "ఆర్ ఆర్ ఆర్" సినిమా సూపర్ హిట్ అవడంతో రామ్ చరణ్ కి బాలీవుడ్లో సైతం మంచి పేరు లభించింది.

ఇక "ఆచార్య" సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందుకే "ఆచార్య" సినిమాని కూడా హిందీలో విడుదల చేద్దామని అలాగే బాలీవుడ్ లో ఈ చిత్ర ప్రమోషన్స్ లో కూడా రామ్ చరణ్ ను ఇన్వాల్వ్ చేద్దామని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story