Acharya Movie: మెగా అభిమానుల్లో జోష్..ఆచార్య టీజర్ అప్‌డేట్ ఇచ్చిన కొరటాల

మెగా స్టార్ చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Samba Siva Rao
Published on: 27 Jan 2021 2:41 PM IST
Acharya Movie: మెగా అభిమానుల్లో జోష్..ఆచార్య టీజర్ అప్‌డేట్ ఇచ్చిన కొరటాల
X

మెగా స్టార్ చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఓ చిరు అభిమానులకు ఓ తీపికబురు చెప్పారు. ఆచార్య టీజర్ రిలీజ్ డేట్ టైమ్ అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా కొరటాల డియర్ చిరంజీవి సర్.. జనవరి 29 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటున్నాయంటూ టీజర్ అప్‌డేట్‌తో కూడిన చిన్న వీడియో షేర్ చేశారు. ఇది చూసిన చిరంజీవి.. చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు థాంక్యూ కొరటాల అంటూ కామెంట్ చేశారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా భాగం పంచుకుంటున్నారు.

రామ్ చరణ‌్ `సిద్ధ` పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story