Acharya Movie Updates: 'ఆచార్య' రిలీజ్ డేట్ వాయిదా

ఆచార్య వాయిదా వేస్తున్నట్టుగా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అధికారిక ట్వీట్ వెలువడింది

Kranthi
Updated on: 27 April 2021 1:20 PM IST
Acharya Movie Release Date Postponed
X

ఆచార్య మూవీ పోస్టర్ 

Acharya Movie Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. రోజురోజూకు వీటి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో అతలాకుతలం అయిన సినిమా ఇండస్ట్రీలో స్టార్ సినిమాలు ఒకొక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి.

అదే కోవలో మెగాస్టార్ చిరంజివి కథానాయకుడిగా 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ ఫ్లాప్ అనే మాట వినని కొరటాల శివ రూపొందిస్తూ ఉండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటిస్తోంది. ఇక ప్రత్యేక పాత్రల్లో చరణ్ - పూజా హెగ్డే సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతంగా ఉండటంతో, షూటింగును వాయిదా వేశారు. చరణ్ పాత్రకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించవలసి ఉండగా షూటింగును ఆపేశారు.

సినిమాను మే 13వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా వాయిదా వేస్తున్నట్టుగా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అధికారిక ట్వీట్ వెలువడింది. ఈ సినిమా విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. చివరికి అదే జరిగింది. పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమాను విడుదల చేస్తామనీ, రిలీజ్ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో ఒకే ఆశయం కోసం కలిసి పోరాడే యోధులుగా చిరంజీవి - చరణ్ కలిసి కనిపించనుండటం, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశంగా మారింది.

ఈసారి ప్రభుత్వాల కన్నా ముందే తెలుగు ఇండస్ట్రీ స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు సినిమాలు వాయిదాబాట పట్టాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్‌సేన్‌ 'పాగల్' రిలీజ్‌లు వాయిదా వేసుకోగా తాజాగా మెగాస్టార్‌ కూడా అదే బాటలో నడిచాడు.

Kranthi

Kranthi

Next Story