Neelambari Song: మెలోడీ బ్రహ్మా సంగీతంతో, సిద్ద స్టెప్పులతో వచ్చేసిన "నీలాంబరి" సాంగ్

Neelambari Song: మెలోడీ బ్రహ్మా సంగీతంతో, సిద్ద స్టెప్పులతో వచ్చేసిన నీలాంబరి సాంగ్
x

మెలోడీ బ్రహ్మా సంగీతంతో, సిద్ద స్టెప్పులతో వచ్చేసిన "నీలాంబరి" సాంగ్

Highlights

Neelambari Song - Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఆచార్య". ఇప్పటికే లాహే లాహే...

Neelambari Song - Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఆచార్య". ఇప్పటికే లాహే లాహే ఫస్ట్ సింగిల్ తో సూపర్ హిట్ అవగా తాజాగా ఈ సినిమాలో సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు అతనికి జంటగా పూజా హెగ్డే "నీలాంబరి" పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరి మధ్య "నీలాంబరి" మెలోడీ సాంగ్ ని చిత్ర యూనిట్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా తాజాగా విడుదల చేశారు.

సంగీత దర్శకుడు మణిశర్మ తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడని ఈ మెలోడీ సాంగ్ వింటేనే అర్ధమవుతుంది. ఇక ఈ మెలోడీ సాంగ్ కి రామ్ చరణ్ వేసిన స్టెప్స్ మెగా అభిమానులను మరింత ఆకట్టుకోనున్నాయి. మ్యాట్నీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories