Acharya - Siddha's Saga Teaser: "ఆచార్య"తో వేటకి దిగిన "సిద్ధాస్‌ సాగా"

* ఆచార్య చిత్రం నుండి రామ్ చరణ్ "సిద్ధాస్‌ సాగా" టీజర్ విడుదల

Sandeep Reddy
Updated on: 28 Nov 2021 4:18 PM IST
Acharya Movie Makers Released Ram Charan as Siddhas Saga Teaser Released Today 28 11 2021
X

Acharya - Siddha's Saga Teaser: "ఆచార్య"తో వేటకి దిగిన "సిద్ధాస్‌ సాగా"

Acharya - Siddha's Saga Teaser: మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్‌ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. అయితే ఇటీవలే "ధర్మమే సిద్ద" అని ట్విట్టర్ పోస్టర్ ని విడుదల చేశాడు.

తాజాగా సిద్ద ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రగా మిగిలిపోతుందని, పవర్ ఫుల్ టీజర్ రాబోతుందని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా విడుదలైన టీజర్ లో రామ్ చరణ్ తన అదిరిపోయే లుక్ తో అభిమానులకు ఆకట్టుకున్నాడు. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే "నీలాంబరి" పాత్రలో కనిపించనుంది. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story