Acharya Collections: తక్కువ కలెక్షన్లతో నిరాశ పరుస్తున్న ఆచార్య

Acharya Movie First Weekend Collections
x

Acharya Collections: తక్కువ కలెక్షన్లతో నిరాశ పరుస్తున్న ఆచార్య

Highlights

Acharya Movie Box Office Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఆచార్య.

Acharya Movie Box Office Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించారు. మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ను అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారబోతోంది. మొదటి వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల తో కలిపి కేవలం 36.5 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమా కలెక్షన్లు తక్కువనే చెప్పాలి. మరోవైపు కర్ణాటక అమెరికా ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 43+ కోట్లకు పైగానే వసూలు చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 స్క్రీన్ జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకునేలా గా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరొక "మృగరాజు" గా మారిందంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories