Acharya Movie: ఆచార్య ఫైనల్ సెటిల్మెంట్ అన్ని కోట్లా?

Acharya Final Settlement: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా మారింది.

Arun Chilukuri
Published on: 7 Jun 2022 8:08 PM IST
Acharya Movie Final Settlement at Rs 33 Cr
X

Acharya Movie: ఆచార్య ఫైనల్ సెటిల్మెంట్ అన్ని కోట్లా?

Acharya Final Settlement: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. మెగా అభిమానులు సైతం ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ కొరటాల శివ తన వంతు బాధ్యతగా డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ సెటిల్మెంట్ ఆఫర్ చేశారట. ఫైనల్ సెటిల్మెంట్ లో భాగంగా కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు 33 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి హైదరాబాద్ కి వచ్చిన చిరంజీవి కూడా దీని గురించి కొరటాల శివని అడిగారట. ఇక మరోవైపు అమెజాన్ ప్రైమ్ వారు ఇంకా ఆ చిత్ర నిర్మాతలకు కొంత అమౌంటు ఇవ్వాల్సి ఉందట. ఆ అమౌంట్ కూడా వచ్చాక డిస్ట్రిబ్యూటర్ లకు ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ కూడా డిస్ట్రిబ్యూటర్ లకు 10 కోట్లు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా జీఎస్టీ తగ్గించినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story