నిరాశ పరుస్తున్న ఆచార్య తొలి రోజు వసూళ్లు

Acharya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 న థియేటర్లలో విడుదలైంది.

Arun Chilukuri
Published on: 30 April 2022 1:00 PM IST
Acharya Movie box Office Collection Day 1
X

నిరాశ పరుస్తున్న ఆచార్య తొలి రోజు వసూళ్లు

Acharya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 న థియేటర్లలో విడుదలైంది. కానీ అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా చతికిలపడింది. మొదటి రోజున ఆచార్య సినిమా 18 కోట్ల దాకా కలెక్షన్లు అందుకుంది. మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన సినిమా పైగా ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ సినిమాకి డైరెక్టర్ కాగా సినిమాకి ఒక విధంగా మంచి ఓపెనింగ్స్ లభించాయి.

అయితే మొదటి రోజు నుంచే ఈ సినిమాకి నెగిటివ్గా రెస్పాన్స్ అందుతుండటంతో సినిమా కలెక్షన్లు పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి వారాంతం తర్వాత కూడా సినిమా కేవలం 50 కోట్ల కలెక్షన్లు మాత్రమే నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. కానీ ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 140 కోట్లకు జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుతుందో లేదో కూడా డౌటే. ఇక ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియన్ లెవెల్ లో మరికొన్ని భాషల్లో విడుదల చేసి ఉంటే కనీసం నష్టాలు రాకుండా ఉండేది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story